Header Banner

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

  Sat May 03, 2025 20:31        Business

గ్లోబల్ హాస్పిటాలిటీ కంపెనీ ఓయో (OYO) మరో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది. తన కంపెనీ-సర్వీస్డ్ హోటళ్లలో ఇన్-హౌస్ కిచెన్‌లు (In-house kitchens), క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) కార్ట్స్‌ ప్రవేశపెట్టడం ద్వారా ఫుడ్ అండ్ బేవరేజ్ (F&B) వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. OYO బ్రాండ్ టౌన్‌హౌస్‌ కేఫ్‌ (Townhouse Cafe)పై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. టౌన్‌హౌస్ అంటే ఒక రకమైన టెర్రస్డ్ హౌస్‌. కానీ ప్రైవేట్ ఎంట్రెన్స్‌ ఉంటుంది. ఈ ఇనిషియేటివ్‌ హోటల్ ఆదాయాన్ని పెంచుతుంది, అతిథులకు భోజన అవసరాలు కూడా తీరుస్తుంది. 2025-26 (FY26) ఆర్థిక సంవత్సరం నుంచి, OYO భారతదేశంలోని 1,500 కంపెనీ-సర్వీస్డ్ హోటళ్లలో దాని F&B సేవలను ప్రారంభిస్తుంది. అతిథులు OYO యాప్, వెబ్‌సైట్ లేదా ఇతర ట్రావెల్ బుకింగ్ సైట్‌ల వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ‘కిచెన్ సర్వీసెస్’ ఆప్షన్‌ సెలక్ట్‌ చేసుకున భోజనాన్ని ఆర్డర్ చేయగలరు. ప్రతి హోటల్ సెటప్ ఆధారంగా కిచెన్స్‌ మారుతూ ఉంటాయి. కొన్ని హోటళ్లలో చాలా ఐటమ్స్‌ ఆఫర్‌ చేసే పూర్తి స్థాయి కమర్షియల్‌ కిచెన్స్‌ ఉంటాయి. మరికొన్నింటిలో సాధారణ ఆహార పదార్థాలు అందించేందుకు చిన్న ప్యాంట్రీ సెటప్‌లు ఉంటాయి. అదనంగా OYO QSR కార్ట్‌లు, లాబీ స్టోర్‌ల కోసం ఒక బ్రాండ్ అయిన టౌన్‌హౌస్ కేఫ్‌ను ప్రారంభిస్తోంది. ఇవి క్విక్‌ కార్ట్స్‌, మిడ్‌నైట్‌ క్రేవింగ్స్‌, లేదా ప్రయాణికులకు అనువైన రెడీ-టు-ఈట్ స్నాక్స్, భోజనాలను అందిస్తాయి.

 

ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

మెనూలో వివిధ అభిరుచులకు అనుగుణంగా సరసమైన ప్రాంతీయ వంటకాలు, కాంటినెంటల్‌ ఆప్షన్లు ఉంటాయి. OYO హోటళ్లలో చాలా మంది రూమ్‌ డైనింగ్‌ ఆప్షన్‌ రిక్వెస్ట్‌ చేయడంతో ఈ ఆలోచన వచ్చింది. తాజా, సౌకర్యవంతమైన, నాణ్యమైన భోజనాన్ని అందించడం ద్వారా ఓయో కస్టమర్లకు సంతృప్తి అందించాలని భావిస్తోంది. స్టేయింగ్‌ని మరింత ఆనందదాయకంగా మార్చాలని ఆశిస్తోంది. ఈ కార్యక్రమం పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత ఈ F&B వెంచర్ ప్రతి హోటల్‌కు 5-10% అదనపు ఆదాయాన్ని జోడిస్తుందని కంపెనీ అంచనా వేస్తోంది. OYO ఈ ఐడియాను 2025 జనవరిలో ఓ పైలట్ ప్రోగ్రామ్‌తో టెస్ట్‌ చేసింది. ఇది ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లోని 100 కంపెనీ-సర్వీస్డ్ హోటళ్లను కవర్ చేసింది. పైలట్ ప్రాజెక్ట్‌ సక్సెస్‌ అయింది. FY26లో దేశవ్యాప్తంగా విస్తరించడానికి మార్గం సుగమం చేసింది. నాణ్యతను నిర్ధారించడానికి OYO ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, ఇండోర్, కోల్‌కతా, జైపూర్, లక్నో సహా ప్రధాన నగరాల్లో ట్రస్టెడ్‌ F&B ఎక్స్‌పర్ట్స్‌ నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. ఇక గెస్ట్‌లు OYO యాప్ లేదా ఇతర ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సులభంగా భోజనాలను ఆర్డర్ చేసుకోవచ్చు. క్విక్‌ స్నాక్స్ నుంచి పూర్తి భోజనం వరకు వివిధ వంటకాలు అందుబాటులో ఉంటాయి. టౌన్‌హౌస్ కేఫ్ కార్ట్‌లు బిజీగా ఉండే ప్రయాణికులకు వేగంగా, తినడానికి సిద్ధంగా ఉన్న ఫుడ్‌ ఆప్షన్లు ఆఫర్‌ చేస్తాయి. F&B ఎక్స్‌పర్ట్స్‌ తయారుచేసిన తాజా, టేస్టీ ఫుడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు. OYO చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వరుణ్ జైన్ ఓ ప్రకటనలో, ‘ఈ ఇనిషియేటివ్‌ మా నెట్‌వర్క్ అంతటా తాజా, సౌకర్యవంతమైన, అధిక-నాణ్యతతో కూడిన భోజనం అందుబాటులో ఉంచుతుంది. అతిథులకు ఇన్‌-హోటల్‌ డైనింగ్‌ బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందిస్తాం.’ అని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: పలు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.4 వేలు! ఈ పథకం గురించి తెలుసా, దరఖాస్తు చేస్కోండి!

 

కూటమి ప్రభుత్వ రాకతో అమరావతి బంగారు బాట! ఇకపై ప్రతి ఆంధ్రుడు..

 

షాకింగ్ న్యూస్.. తెలుగు యూట్యూబర్ అనుమానాస్పద మృతి.. అతనే కారణమా?

 

గుడ్ న్యూస్! ఏపీలోనూ మెట్రోకు గ్రీన్ సిగ్నల్! ఎక్కడంటే?

 

గన్నవరం ఎయిర్‌పోర్టులో మరోసారి కలకలం.. ఈసారి ఏం జరిగిందంటే!

 

ప్రయాణించేవారికి శుభవార్త.. అమరావతికి సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ.. సిద్ధమైన కృష్ణా నదిపై వారధి!

 

అకౌంట్లలో డబ్బు జమ.. 1 లక్ష రుణమాఫీ. ప్రభుత్వం ఆదేశాలు.! గైడ్‌లైన్స్ విడుదల!

 

రూ.500 నోట్లకు ఏమైంది.. ఇక ఎటిఎంలలో 100, 200 నోట్లు.. RBI కీలక నిర్ణయం..!

 

మాజీ మంత్రి బిగ్ షాక్.. విచారణ ప్రారంభం! వెలుగులోకి కీలక ఆధారాలు..

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి..

 

అద్భుతమైన స్కీం.. మీ భార్య మిమల్ని లక్షాధికారిని చేయొచ్చు.. ఈ‌ చిన్న పని తో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices